గ్రేటర్, రంగారెడ్డి బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి రివ్యూ
29న ఉద్యమకారులు, మేధావులు, కళాకారులతో షా భేటీ
ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా పార్టీ ప్రోగ్రామ్‌లను సక్సెస్ చేయడంపై మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు నేతలతో పార్టీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్‌లోని ఓ ఫం క్షన్ హాల్లో 29న ఉదయం 3 వేల మంది వివిధ రంగాలకు చెందిన మేధావులు, ఉద్యమకారులు, కవు లు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులతో పాటు ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఆ తర్వాత సిటీలోని మరో చోట పార్టీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల బీజేపీ కన్వీనర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీకి మళ్లీ జోష్ తీసుకువచ్చేలా నియోజకవర్గ స్థాయి నేతలను సైతం అమిత్ షా మీటింగ్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ రెండు ప్రోగ్రామ్ లను సక్సెస్ చేసేందుకు గ్రేటర్ పరిధిలోని జనంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించడంపై ఈ రెండు ప్రాంతాల ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి చర్చించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిషన్ రెడ్డికి ఇది పార్టీ పరంగా రెండో సమావేశం. మొదటిది మోదీ వరంగల్ సభ. ఈ సమావేశాన్ని కూడా చాలెంజ్‌గా తీసుకున్న ఆయన.. అమిత్ షా టూర్‌ను పూర్తిస్థాయిలో సక్సెస్ చేయడంపై ఫోకస్ పెట్టారు.
వచ్చే నెల 2న ధర్నా
రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలన్న డిమాండ్‌తో మంగళవారం (ఈ నెల 25) ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నా నిర్వహించాల్సి ఉం డగా, వర్షాల కారణంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
27న మోదీ స్పీచ్
దేశవ్యాప్తంగా రైతులకు ఇస్తున్న ఎరువుల సబ్సిడీ, కిసాన్ సమ్మాన్ నిధి స్కీం వంటి పథకాలను వివరించేందుకు ప్రధాని మోదీ ఈ నెల 27న రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులు కూడా మోదీ స్పీచ్ వినేందుకు వీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఫర్టిలైజర్స్ షాపుల వద్ద బీజేపీ ఆధ్యర్యంలో పెద్ద, పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నారు.