టైం కట్​ మూవీ రివ్యూ : చనిపోయిన రోజుకంటే వారం రోజులు వెనక్కి వెళ్తే..

టైం కట్​ మూవీ రివ్యూ : చనిపోయిన రోజుకంటే వారం రోజులు వెనక్కి వెళ్తే..

గతంలోకి ప్రయాణం!

టైటిల్ : టైం కట్​
ప్లాట్​ఫాం : నెట్​ఫ్లిక్స్​
 డైరెక్షన్ : హన్నా మ్యాక్‌ఫెర్సన్
 కాస్ట్ : మాడిసన్ బెయిలీ, మేగాన్ బెస్ట్, మైఖేల్ షాంక్స్, ఆంటోనియా జెంట్రీ, గ్రిఫిన్ గ్లక్
లాంగ్వేజ్: ఇంగ్లీష్​

లూసీ(మాడిసన్ బెయిలీ) పుట్టకముందే వాళ్ల అక్క సమ్మర్(ఆంటోనియా జెంట్రీ)ని గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తాడు. అప్పుడే ఆమెతో పాటు మరో ముగ్గుర్ని కూడా చంపేస్తారు. ఆమెని ఎవరు చంపారు? ఎందుకు చంపారనేది ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఆమె తల్లిదండ్రులు సమ్మర్​ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. సమ్మర్​ గదిని ఒక పవిత్ర స్థలంగా చూసుకుంటారు.

గదిలోని వస్తువులను చెక్కుచెదరకుండా కాపాడుకుంటారు. ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజున ఆ గదిలో నివాళులు అర్పిస్తారు. అలా 21 ఏండ్లు గడిచిపోతాయి. 2024లో సమ్మర్​ వర్ధంతి రోజు లూసీకి ఆమె గదిలో ఒక బెదిరింపు లెటర్​ దొరుకుతుంది. సమ్మర్ చావుకు సంబంధించి దొరికిన ఏకైక క్లూ అది. ఆ క్లూతో తన అక్కని చంపింది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది లూసీ.

కానీ.. అదే టైంలో ఆమెకు టైం ట్రావెల్​ చేసే మెషీన్​ దొరుకుతుంది. దాని సాయంతో సమ్మర్​ చనిపోయిన రోజుకంటే వారం రోజులు వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? లూసీ తన అక్కని చనిపోకుండా కాపాడగలిగిందా? ఆమెని చంపినవాళ్లను కనిపెట్టిందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.