1000 బేబీస్ రివ్యూ .. పురిట్లోనే మారిపోయిన పిల్లలు

1000 బేబీస్ రివ్యూ .. పురిట్లోనే మారిపోయిన పిల్లలు

టైటిల్ : 1000 బేబీస్, 
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్, 
డైరెక్షన్ : నజీమ్ కోయా, 
కాస్ట్ : నీనా గుప్తా, రెహమాన్, ఆదిల్ ఇబ్రహీం, అశ్విన్ కుమార్, సంజు శివరామ్

బిబిన్‌‌‌‌ ఓసెఫ్‌‌‌‌ (సంజూ శివరామ్‌‌‌‌) తన తల్లి సారా (నీనా గుప్త) మీద దాడి చేస్తాడు. దాంతో ఆమెని ఇంటి చుట్టుపక్కల వాళ్లు హాస్పిటల్​లో చేరుస్తారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె తన చివరి కోరికగా ఆ ఏరియా సీఐ, లాయర్​ని కలిపించమని తనకు ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్​ని అడుగుతుంది. పోలీస్, లాయర్​లకు సీల్డ్​ కవర్​లో పెట్టిన ఉత్తరాలను చెరొకటి ఇస్తుంది. 

లాయర్​కి ఇచ్చిన కవర్​ని మెజిస్ట్రేట్​కి ఇవ్వమని చెప్తుంది. ఆ లెటర్​లో ఉన్న విషయం చదివిన మెజిస్ట్రేట్​ షాక్​ అవుతాడు. వాస్తవానికి ఆ విషయం తెలియడం వల్లే ఆమె కొడుకు తనపై దాడి చేస్తాడు. ఆ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని నిజాన్ని అందరూ దాచేస్తారు. కానీ.. అందులోని విషయం తెలిసిన ఆమె కొడుకు బిబిన్‌‌‌‌ ఓసెఫ్‌‌‌‌ ఇంటి నుంచి పారిపోతాడు. 

కట్‌‌‌‌చేస్తే.. 12 ఏండ్లు గడిచిపోతాయి. యాన్సీ అనే సినీ హీరోయిన్‌‌‌‌ తన కారులో అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. సెలబ్రిటీ కావడంతో ఆ మర్డర్​ గురించి మీడియాలో హైలైట్‌‌‌‌ అవుతుంది. ఆ కేసును సాల్వ్​ చేసేందుకు సీఐ అజీ కురియన్‌‌‌‌ (రెహమాన్‌‌‌‌) వెళ్తాడు. యాన్సీని ఆమె భర్త చంపాడని మొదట అనుమానిస్తారు. కానీ.. కొన్ని రోజుల క్రితం పరిచయమైన బిబిన్‌‌‌‌ అనే వ్యక్తి వల్లే మర్డర్‌‌‌‌ చేశానని ఆమె భర్త చెప్తాడు.

 అప్పుడు బిబిన్‌‌‌‌ గురించి ఆరా తీసిన సీఐకి షాకింగ్​ విషయాలు తెలుస్తాయి. హీరోయిన్​ మర్డర్​కి కారణం తెలిసి ఆశ్చర్యపోతాడు. పన్నెండేండ్ల క్రితం సారా రాసిన లెటర్​కు, ఈ మర్డర్​కు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ లెటర్​లో ఏముంది? 1000 మంది చిన్నారుల జీవితాలు తారుమారవడానికి సారా ఎలా కారణమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ సిరీస్​ చూస్తేనే సమాధానం దొరుకుతుంది.