లబ్బర్​ పంధు రివ్యూ : క్రికెట్​ లవ్​

లబ్బర్​ పంధు రివ్యూ : క్రికెట్​ లవ్​

టైటిల్ : లబ్బర్​ పంధు(రబ్బర్​ బంతి)
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డైరెక్షన్ : తమిళరసన్ పచ్చముత్తు
కాస్ట్ : హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్, స్వాసిక, సంజన కృష్ణమూర్తి, కాళి వెంకట్, బాల శరవణన్, జెన్సన్ దివాకర్

ఇద్దరు గల్లీ క్రికెటర్ల ఈగో ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందన్నది ఈ మూవీ సబ్జెక్ట్​. గేతు (అట్టకత్తి దినేష్) బ్యాట్స్‌‌‌‌మెన్. అన్బు (హరీష్ కళ్యాణ్) మంచి బౌలర్. ఇద్దరూ కలసి ఒక మ్యాచ్​ ఆడినప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. గేతు భార్య యశోద (స్వాసిక)కు భర్త అంటే ప్రాణం. కానీ.. అతను క్రికెట్ ఆడడం ఆమెకు నచ్చదు. అన్బు కాలేజీ స్టూడెంట్​. అతనికి అనుకోకుండా లోకల్​ క్రికెట్ జట్టు జాలీ ఫ్రెండ్స్ కోసం ఆడే అవకాశం వస్తుంది. కానీ.. టీంలో ఆధిపత్య కుల ఆటగాళ్ల వల్ల బౌలింగ్ చేసే అవకాశం అతనికి ఇవ్వరు.

 కానీ.. తన మీద తనకున్న నమ్మకంతో తనకు తానే ‘యార్కర్ కింగ్’ అని బిరుదు ఇచ్చుకుంటాడు. అతను టౌన్​లో జెర్సీ దుకాణం కూడా నడుపుతుంటాడు. గేతు కూతురు దుర్గ (సంజన కృష్ణమూర్తి)తో ప్రేమలో పడతాడు. దాంతో గేతు, అన్బుల క్రికెట్ శతృత్వం వ్యక్తిగత పగగా మారుతుంది. వాళ్ల మధ్య గొడవ ఎంతవరకు దారి తీస్తుంది? అన్బు ప్రేమ సక్సెస్​ అవుతుందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.