రైడ్ రివ్యూ .. అమ్మాయిలు మిస్సింగ్​

రైడ్ రివ్యూ .. అమ్మాయిలు మిస్సింగ్​

టైటిల్ : రైడ్
ప్లాట్​ ఫాం : ఆహా (తెలుగు)
డైరెక్షన్ : కార్తి
కాస్ట్ : విక్రమ్​ ప్రభు, శ్రీ దివ్య, అనంతిక, వేలు ప్రభాకరన్​​, సౌందరరాజా​

కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన ‘తగరు’ సినిమాకి రీమేక్ ఇది. గతేడాది తమిళంలో తీసిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రిలీజ్​ చేశారు. కథలోకి వెళ్తే.. ఏసీపీ ప్రభాకరన్ (విక్రమ్ ప్రభు) చాలా ధైర్యవంతుడు. ప్రమాదం​ అని తెలిసినా సమస్యలకు ఎదురు వెళ్తుంటాడు. అతనికి డ్యూటీ మీద ఉన్న గౌరవాన్ని చూసి ఒక సీనియర్​ పోలీసాఫీసర్​ తన కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. అందుకు ప్రభాకరన్​ కూడా ఒప్పుకుంటాడు. అదే టైంలో ప్రభాకరన్ పోలీస్ స్టేషన్​లో అమ్మాయిల మిస్సింగ్, హత్యల కేసులు వరుసగా నమోదవుతుంటాయి. 

దాంతో అతను ఆ కేసుల మీద ఫోకస్​ పెడతాడు. అప్పుడు అతనికి ఆ మిస్సింగ్​ కేసులకు కారణం.. గ్యాంగ్‌‌‌‌స్టర్ డాలీ (రిషి రిత్విక్) అని తెలుస్తుంది. డాలీ తన ఫ్రెండ్​తో కలిసి ఒక రిసార్ట్​ నడుపుతుంటాడు. అక్కడ వాటర్ గేమ్స్  ఉంటాయి. అక్కడికి వచ్చిన అమ్మాయిల వీడియోలను సీక్రెట్​గా తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. అందుకు అతని తమ్ముడు కూడా సపోర్ట్​ చేస్తుంటాడు. ఈ విషయాలు తెలుసుకున్న ప్రభాకరన్​ డాలీ తమ్ముడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే అసలు కథ.