రీటా సన్యాల్​ రివ్యూ : చంపిందెవరు?

రీటా సన్యాల్​ రివ్యూ : చంపిందెవరు?

టైటిల్ : రీటా సన్యాల్​
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​, డైరెక్షన్ : అభిరూప్​ ఘోష్​
కాస్ట్ : అదా శర్మ, రాహుల్​ దేవ్​, ఫైసల్​ సయ్యద్​, అంకుర్​ రాతీ 

క్రిమినల్​ లాయర్​ రీటా సన్యాల్ (అదా శర్మ) కుక్క కేసును వాదిస్తున్న సీన్​తో స్టోరీ మొదలవుతుంది. రాఖీ అనే కుక్క ఐదడుగుల ఫెన్సింగ్​ ఎక్కి నాలుగు కుక్కపిల్లలకు తండ్రి అయ్యిందనేది ఆరోపణ. అంతేకాదు.. తల్లి అయిన కుక్క కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రీటా ఆ కేసు గెలుస్తుంది. కోర్టు నుంచి బయటికి రాగానే కేశవ్​ అనే వ్యక్తి ఆమెని కలుస్తాడు. అతని తల్లి స్థానిక ఎమ్మెల్యే పరవ్ రాణే హత్య కేసులో అరెస్టవుతుంది. రీటా ఆ కేసు గురించి ఆరా తీసినప్పుడు ఆ నేరం చేసింది తన తల్లి కాదని చెప్తాడు కేశవ్‌.

 రీటా కేశవ్ కేసును వాదించేందుకు తీసుకున్నప్పుడు ఆమెకు మరో విషయం తెలుస్తుంది. తన ప్రత్యర్థి లాయర్​ మరెవరో కాదు.. తన తండ్రి చావుకు కారణమైన రాజ్ థక్రాల్ (రాహుల్ దేవ్) అని. దాంతో ఇంకా పంతంగా ఆ కేసుని టేకప్​ చేస్తుంది. రీటా ఆ కేసులో గెలిచిందా? ఓడిపోయిందా? కేసు వాదించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ​.