స్నేక్స్​ అండ్​ ల్యాడర్స్​ రివ్యూ : అనుకోకుండా అల్మారాలో..

స్నేక్స్​ అండ్​ ల్యాడర్స్​ రివ్యూ : అనుకోకుండా అల్మారాలో..

టైటిల్ : స్నేక్స్​ అండ్​ ల్యాడర్స్​
ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్ వీడియో 
డైరెక్షన్ : భరత్ మురళీధరన్, అశోక్ వీరపన్, కమలా ఆల్కెమిస్
కాస్ట్ : సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్య కుమార్, తరుణ్ యువరాజ్, సాషా భరేన్, నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా

ఇండియాలో వైకుంఠ పాళి (స్నేక్స్​ అండ్​ ల్యాడర్స్) గేమ్​ చాలా ఫేమస్​. 1980, 90ల్లో పిల్లలు ఈ గేమ్​ ఎక్కువగా ఆడేవాళ్లు. ఇందులో అదృష్టం ఉంటే నిచ్చెనలు ఎక్కుతారు. లేదంటే పాములకు బలవుతారు. ఈ కథ కూడా ఆ గేమ్​కు దగ్గరగా ఉండడం వల్ల ఆ టైటిల్​ పెట్టారు. 

రెట్టముగాడు అనే హిల్ స్టేషన్(కల్పిత)​లో 2006లో జరిగిన కథ ఇది. గిల్బర్ట్ అలియాస్​ గిల్​ (సమ్రిత్), ఇరైయన్ (సూర్య రాఘవేశ్వర్), శాండీ (సూర్య కుమార్), బాల (తరుణ్ యువరాజ్) మంచి ఫ్రెండ్స్​. వీళ్లందరికీ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. గిలీ కొన్నేళ్లుగా తన తల్లిదండ్రులను చూడలేదు. శాండీ తండ్రి ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఒకరోజు కొందరు దొంగలు అదే ఊళ్లో ఉన్న మ్యూజియంలోని విలువైన లాకెట్​ని చోరీ చేస్తారు. తర్వాత ఈ నలుగురికీ కామన్​ ఫ్రెండ్​ అయిన రాగి ఇంటికి వెళ్తారు. అక్కడ రాగి వాళ్ల అమ్మ మీద దాడి చేసి.. తర్వాత గిలీ ఇంట్లోకి చొరబడతారు. 

బ్లేడ్​ అనే దొంగ గిలీ ఇంట్లోని వంటగది అల్మరాలో దాక్కుంటాడు. అది గమనించిన గిలీ తన అమ్మమ్మను కాపాడుకోవడానికి దానికి తాళం వేస్తాడు. బ్లేడ్​కి ఉబ్బసం ఉంటుంది. అల్మరాలో చిక్కుకోవడం వల్ల ఊపిరాడక అందులోనే చనిపోతాడు. దాంతో గిలీ హంతకుడు అవుతాడు. గిలీ, అతని నలుగురు ఫ్రెండ్స్​ కలిసి శవాన్ని మాయం చేస్తే హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?​ లాకెట్‌‌‌‌‌‌‌‌ తీసుకుని బ్లేడ్ తన స్థావరానికి తిరిగి వెళ్లకపోవడంతో ఆ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ ఏం చేశాడు అనేదే ఈ వెబ్​సిరీస్​.