టైటిల్ : ఐయామ్ కథలన్
ప్లాట్ ఫాం : మనోరమా మ్యాక్స్
డైరెక్షన్ : గిరీష్ ఏడీ
కాస్ట్ : నస్లెన్ గఫూర్, లిజో మోల్ జోస్, దిలీష్ పోతన్, అనిష్మా
విష్ణు (నస్లెన్ గఫూర్) ఇంజినీరింగ్ పూర్తి కాగానే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తాడు. కానీ.. అతని బ్యాక్‌లాగ్స్, వీక్ ప్రొఫైల్ వల్ల ఎక్కడా ఉద్యోగం దొరకదు. అతను శిల్ప (అనిష్మా అనిల్‌కుమార్)తో రిలేషన్లో ఉంటాడు. విష్ణుకు ఉద్యోగం రాకపోవడం, కెరీర్‌పై సీరియెస్నెస్ లేకపోవడంతో శిల్ప అతన్ని దూరం పెడుతుంటుంది. బ్యాక్‌లాగ్స్ పూర్తి చేయలేకపోయినా సైబర్ హ్యాకింగ్‌లో విష్ణుకు మంచి పట్టు ఉంది. వైఫై, సోషల్ మీడియా అకౌంట్ల పాస్వర్ట్స్ని హ్యాక్ చేయడంలో ఎక్స్పర్ట్. శిల్ప తండ్రి చాకో (దిలీష్ పోతన్) రాయల్ పెరియాదన్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ)కి ఐటీ హెడ్‌గా పనిచేస్తుంటాడు. ఒకసారి విష్ణు చాకో పనిచేసే ఆఫీస్‌లో శిల్ప ఉందని తెలిసి కలవడానికి వెళ్తాడు. అప్పుడు చాకోకు వాళ్ల రిలేషన్ గురించి తెలిసిపోతుంది. చాకో కోపంతో విష్ణుని కొడతాడు. దాంతో చాకో మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతను పనిచేస్తున్న బ్యాంక్ సర్వర్‌ని విష్ణు హ్యాక్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శిల్పతండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? విష్ణు, శిల్ప ఒక్కటయ్యారా? లేదా? సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ సిమి (లిజో మోల్) విష్ణుని పట్టుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాలి.
అందర్నీ కలిపే కామన్ పాయింట్!
టైటిల్ : వన్స్ అపాన్ ఎ టైమ్ లో మద్రాసు
ప్లాట్ ఫాం : ఆహా
డైరెక్షన్ : ప్రసాద్ మురుగన్
కాస్ట్ : భరత్, అభిరామి, అంజలి నాయర్,తలైవాసల్ విజయ్, షాన్, పవిత్ర లక్ష్మి
మాజీ రౌడీ రాజా (భరత్) భార్య కిడ్నీ సమస్యతో ప్రాణాలతో పోరాడుతుంటుంది. ఆమె ట్రీట్మెంట్ కోసం 15 లక్షలు కావాలి. కానీ.. అతని దగ్గర అంత డబ్బు ఉండదు. దాంతో మళ్లీ రౌడీగా మారాలని నిర్ణయించుకుంటాడు. సావిత్రి (అభిరామి) తన ట్రాన్స్‌జెండర్ కొడుకుని చదివించేందుకు ఇబ్బంది పడుతుంటుంది. పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లిన మది(అంజలి నాయర్)కి అక్కడంతా తేడాగా అనిపిస్తుంటుంది. తన భర్తతోపాటు అత్తామామలు ఏదో కుట్ర చేస్తున్నారని డిసైడ్ అవుతుంది. కుల పిచ్చి ఉన్న నాథన్ (తలైవాసల్ విజయ్) తన కూతురు అనిత (పవిత్ర) వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వీళ్లంతా తమ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు? వీళ్లందర్నీ కలిపే కామన్ పాయింట్ ఏంటి? అనేదే మిగతా కథ.
రెడ్ లైట్ ఏరియాకు పారిపోయి..
టైటిల్ : చిడియా ఉద్ద్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్
డైరెక్షన్ : రవి జాదవ్
కాస్ట్ : జాకీ ష్రాఫ్, భూమిక మీనా, సికందర్ ఖేర్
సెహెర్ (భూమిక మీనా) అనే అమ్మాయి ఒక ఊహించని సంఘటన వల్ల రాజస్థాన్ నుండి పారిపోవాల్సి వస్తుంది. అక్కడినుంచి తన డ్రీమ్ సిటీ ముంబైలోకి అడుగుపెడుతుంది. కానీ.. రెడ్-లైట్ ఏరియాలోని కామాతిపురకు చేరుకుంటుంది. అక్కడామె రెండు అండర్ వరల్డ్ వర్గాల మధ్య చిక్కుకుంటుంది. సెహెర్ తనను తాను కాపాడుకోవడానికి వాళ్లతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలి.