3 లైటింగ్ మోడ్స్ తో.. వైర్ లెస్ స్టడీ టేబుల్​ ల్యాంప్​

3 లైటింగ్ మోడ్స్ తో.. వైర్ లెస్ స్టడీ టేబుల్​ ల్యాంప్​

పుస్తకం చదివేటప్పుడు, పిల్లలు హోం వర్క్​ చేసేటప్పుడు లైటింగ్​ బాగుంటే కళ్లకు స్ట్రెయిన్​ తగ్గుతుంది. అందుకే స్టడీ టేబుల్​ మీద ఇలాంటి ల్యాంప్​ పెట్టుకోవాలి. దీన్ని ద్రవిణ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ వైర్​లెస్​ ల్యాంప్​ని ఇల్లు, ఆఫీస్​.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మాగ్నెట్ అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో రావడం వల్ల ఇన్​స్టాలేషన్​ అవసరం లేదు. ఎక్కడైనా స్టిక్​ చేసుకోవచ్చు. 

దీనికి ఉండే స్ట్రాప్​ని మేకుల్లాంటి వాటికి తగిలించుకోవచ్చు. ఇందులో వార్మ్‌‌‌‌‌‌‌‌, ఎల్లో, వైట్​.. మూడు లైటింగ్‌‌‌‌‌‌‌‌ మోడ్స్​ ఉంటాయి. 600 ఫ్లక్స్ ల్యూమినస్​ బ్రైట్​నెస్​తో వస్తుంది. హై క్వాలిటీ బ్యాటరీ ఉంటుంది. దాన్ని 1,000 చార్జింగ్ సైకిల్స్​ వరకు వాడుకోవచ్చు. ఫుల్​ చార్జ్​ చేస్తే.. స్ట్రాంగ్ లైట్ 2 గంటలు, డిమ్ లైట్ 6 గంటలు వెలుగుతుంది. దీనికి మైక్రో యూఎస్​బీతో చార్జింగ్​​ పెట్టుకోవచ్చు. 

ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇన్​బిల్ట్‌‌‌‌‌‌‌‌ డిజిటల్ క్లాక్ ఉంటుంది. లైట్​ పక్కనే ఉన్న స్క్రీన్​ మీద టైం చూపిస్తుంటుంది. ప్యాక్​లో వచ్చే రిమోట్​తో లైట్​ని ఆపరేట్​ చేయొచ్చు. దీన్ని వార్డ్‌‌‌‌‌‌‌‌రోబ్, కిచెన్​, క్లోసెట్ లైట్​గా కూడా వాడుకోవచ్చు. 

ధర రూ799