పర్సనల్ లేదా వర్క్ కోసం రెగ్యులర్‌గా వాట్సాప్ ఉపయోగించేవాళ్లకు బాగా పనికొచ్చే ఫీచర్ ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ).
ఈ ఫీచర్‌ని వాట్సాప్ త్వరలోనే తేబోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ బీటా వెర్షన్ 2.24.13.14లో ఈ విషయాన్ని చెప్పింది.
వాట్సాప్‌లో కొత్త ఏఆర్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్స్‌తో ఎక్స్పరిమెంట్స్ చేస్తోంది. ఈ ఏఆర్ ఎఫెక్ట్‌లు డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్స్‌ను యాడ్ చేయడం ద్వారా వాళ్ల వీడియో కాల్స్‌ను కస్టమైజ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఉదాహరణకు.. టచ్-అప్ టూల్‌తో తక్కువ కాంతిలోనూ వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు యూజర్లు వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసేలా ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.
ముఖ్యంగా ఇది గ్రూప్ కాన్ఫరెన్స్‌లకు బాగా పనికొస్తుంది. అప్పుడు యూజర్లు తమకు అవసరమైన వాటిని ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ ఫీచర్ భవిష్యత్తులో డెస్క్‌టాప్ యాప్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. వాట్సాప్ కాల్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ సెట్టింగ్స్ లేదా డీటెయిల్డ్ బ్యాక్‌గ్రౌండ్ అడ్జెస్ట్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.
వాట్సాప్‌లో ఈ ఫీచర్స్‌తో పాటు, వీడియో కాల్స్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చుతుంది. వాట్సాప్ కాల్ చేసేటప్పుడు క్రియేటివిటీతో పాటు ఈ ఫీచర్ ప్రైవసీ పరంగా యూజర్లను అనుమతిస్తుంది. కాల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్‌కు వాట్సాప్ ఏఆర్ ఫీచర్‌ని ఇంకా డెవలప్ చేసే దశలో ఉంది.