
ములుగు, వెలుగు : సైక్లింగ్ తో శారీరక దృఢత్వం పెంపొందుతుందని సైక్లింగ్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ములుగులో జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలను నిర్వహించగా, ప్రవీణ్ ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో సైక్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనున్నాయని, అందులో భాగంగా ములుగులో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 50 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నగా, రాష్ట్ర స్థాయి పోటీలకు 24 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ పోరిక అసిలాల్, కేలో ఇండియా సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ నాయక్, డిస్టిక్ అసోసియేషన్ మెంబర్ మోహన్ లాల్, సీహెచ్.ఆనంద్, క్రీడాకారులు పాల్గొన్నారు.