లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి..నో ఛార్జెస్..బట్ ఓ కండీష‌న్‌!

లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి..నో ఛార్జెస్..బట్ ఓ కండీష‌న్‌!

ఒకప్పుడు స్టార్ మా ఛానెల్‌లో ‘అగ్ని సాక్షి’ ( Agnisakshi) పేరుతో ఒక సీరియల్ వచ్చేది. అదే పేరుతో ఇప్పుడు వెబ్‌సిరీస్‌ తీశారు. ఆ సీరియల్‌లో హీరో, హీరోయిన్లుగా చేసినవాళ్లే ఇందులోనూ లీడ్​ రోల్స్​లో నటించారు.  అర్జున్ అంబాటి, ఐశ్వ‌ర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్ర‌తి శుక్ర‌వారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఈ వెబ్‌సిరీస్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది.

అంతేకాదు ఇపుడు ఈ అగ్ని సాక్షి వెబ్ సిరీస్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసే అవ‌కాశాన్ని మేక‌ర్స్ క‌ల్పించారు. స్టార్ మా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ నాలుగు ఎపిసోడ్స్‌ను ఫ్రీగా చూడొచ్చు అంటూ అధికారికంగా ప్రకటించింది. స్టార్ మా యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఈ నాలుగు ఎపిసోడ్స్‌ను ఎటువంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఆడియెన్స్ అంద‌రూ చూసే అవ‌కాశాన్ని స్టార్ మా క‌ల్పించింది. అయితే, మిగిలిన ఎపిసోడ్స్‌ను కూడా ఫ్రీగా యూట్యూబ్‌లోని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

కథేంటంటే:

మొదటి ఎపిసోడ్‌లో విలన్ (ఓ మాస్క్‌మ్యాన్) అమ్మాయిల‌ను హ‌త్య‌లు చేస్తుంటాడు. గౌరి (ఐశ్వ‌ర్య‌) ఎంట్రీ ఇస్తాడు. కానీ.. అతను ఎవరనేది రివీల్‌ చేయరు. ముఖానికి మాస్క్‌ పెట్టుకుని కనిపిస్తాడు. పెళ్లి చేసుకోబోతున్న ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసి, ఆ అమ్మాయి జుట్టు కత్తిరించి తీసుకెళ్తాడు. తర్వాత గౌరీ(ఐశ్వర్య పిస్సే)ని చంపేందుకు ప్లాన్‌ వేస్తాడు. ఏసీపీ ఉమా శంకర్(అంబటి అర్జున్) నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్. ఒక నేరస్తుడిని పట్టుకునేందుకు అతని గ్యాంగ్‌లోనే చేరేందుకు ట్రై చేస్తుంటాడు. అందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తాడు. కానీ, ఆ స్టింగ్ ఆపరేషన్‌లోకి గౌరీ వచ్చి చెడగొట్టేస్తుంది.

ఆమె చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలు కంటుంది. కానీ.. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతుంది. తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయిల దగ్గర పెరుగుతుంది. ఆమె తండ్రి కూడా పోలీసే. కానీ... కొన్ని కారణాల వల్ల గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. మరో వైపు శంకర్ అన్నా–వదినలు కూడా చనిపోతారు.  సీన్‌ కట్‌ చేస్తే.. గౌరీ రోడ్డు మీద వెళ్తుంటే మాస్క్ మ్యాన్ కారుతో యాక్సిడెంట్​ చేసేందుకు ప్రయత్నిస్తాడు. సరిగా అదే టైంకి శంకర్ వచ్చి కాపాడతాడు. కానీ... గౌరీ అతనితో గొడవకు దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మాస్క్ మ్యాన్‌ ఎవరు? గౌరీ తల్లిదండ్రులు, శంకర్‌‌ అన్నావదినలు ఎందుకు చనిపోయారు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.