మాస్టర్ డేటింగ్ అంటే ఏంటీ.. టిక్ టాక్ ట్రెండింగ్ ఎందుకు.. !

మాస్టర్ డేటింగ్ అంటే ఏంటీ.. టిక్ టాక్ ట్రెండింగ్ ఎందుకు.. !

మాస్టర్ డేటింగ్..ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్.. మాస్టర్ డేటింగ్ అనేది సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో హల్ చల్ చేస్తోంది. అయితే మాస్టర్ డేటింగ్ అంటే ఏందీ.. ఒకప్పుడు ఒంటరిగా గడిపేందుకు భయపడే మనం.. తోడు కోసం వెతుక్కునేవాళ్లం.. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒంటరిగా ఆనందంగా జీవించేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొత్త ట్రెండింగ్ కు తెర లేపుతున్నారు. 

నౌ ఏ డేస్.. ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్ట పడుతున్నారు. దీనినే మాస్టర్ డేటింగ్ అంటారు.అంటే మీకు మీరుగా ఉండటమే.. ప్రతిదీ ఒంటరిగా  ఆస్వాదించడమే.. ఇక్కడ ఎవ్వరి జోక్యం ఉండదు.. మిమ్మల్ని ప్రేమించుకోవచ్చు.. మీ కు నచ్చిన ప్రదేశాలకు వెళ్లొచ్చు.. రెస్టారెంట్లు, బార్లు ఇలా  లోకేషన్స్ ఏదైనా మీకు మీరే.. ఫొటోలు దిగొచ్చు,..వీడియో షూట్ చేసుకోవచ్చు మీకు మీరుగా.. మొత్తంగా చెప్పాలంటే ఎవ్వరితో సంబంధం లేకుండా మీకు  మీరు ఎంజాయ్ చేయడం అంటున్నారు డేటింగ్ ఎక్స్ పర్ట మెలిస్సా స్టోన్.. 

మాస్టర్ డేటింగ్ (MasterDating) అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.