అప్పట్లో పచ్చబొట్టు. ఇప్పుడు టాటూ. యూత్ లో టాటూస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోస్... సెలెబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా ప్రతి ఒక్కరూ టాటు వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ సరేసరి. రకరకాల వెరైటీ టాటూస్ తో నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు తెగ ఆరాటపడుతున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలో టాటూ స్టూడియోస్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టాటూస్ కు ఉన్న డిమాండ్ తో చాలామంది దీన్నే ప్రొఫెషన్ గా చేసుకుంటున్నారు.
సాధారణంగా మార్కెట్లోకి ఏదైనా కొత్తగా వచ్చిందంటే దాన్నే ఫాలో అవుతుంటారు యూత్. కానీ అప్పటికీ, ఇప్పటికీ టాటూలకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు సరికదా.... రోజు రోజుకు వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారింది. కొందరు స్టైల్ కోసం డిఫరెంట్ టాటూస్ వేయించుకుంటుంటే.... మరికొందరు నచ్చినవారి పేర్లు, ఫోటోస్ వేయించుకుంటున్నారు. ఇంకొందరు రిలీజియస్ టాటుస్ , దేవుళ్ల వంటివి వేయించుకుంటున్నారు. మరికొందరు వారి వారి ప్రొఫెషన్ కి సంబంధించినవి టాటూలుగా వేయించుకొని అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో టాటూలకి పెరిగిన డిమాండ్ తో సిటీలోని గల్లీ గల్లీలో టాటు స్టూడియోస్ వెలిశాయి.
రోజు రోజుకు టాటూలపై యూత్ లో ఫుల్ క్రేజ్ పెరిగిందని చెప్తున్నారు టాటూ స్టూడియోస్ నిర్వాహకులు. ఎక్కువ మంది వారికి నచ్చిన నేమ్స్ తో పాటు, ఇష్టమైన వారి ఫోటోస్, సెంటిమెంట్ గాడ్స్ , స్టైలిష్ గా ఉండే వాటిని ప్రెఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. టాటు స్ కి ఇంచ్ ని బట్టి, డిజైన్ల వారీగా కాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. చాలా స్టూడియోస్ లో టాటు కోర్సులు కూడా మొదలు పెట్టారు.
ఒకపుడు కొంత మందికి పరిమితమైన ఈ కళ ఇప్పుడు ఈ నయా ఫ్యాషన్ గా మారింది. దీనికి స్పెషల్ ఈవెంట్స్ కూడా వచ్చాయంటే ఈ ట్రెండ్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది యూత్ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ అయిన టాటూస్కి ఫిదా అవుతున్నారు. అందుకే దీన్నే కెరీర్ గానూ ఎంచుకుంటున్నారు. ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ట్రెండ్ సెట్టర్స్ గా మారుతున్నారు.
టాటూస్ కి పెరిగిన క్రేజ్ తో సిటీలో ఈ రెండు, మూడేళ్లలోనే టాటూ స్టూడియోలు పెరిగాయి. ఐతే అందరికి ఈ టాటూస్ పడవని అంటున్నారు స్కిన్ డాక్టర్స్. కాస్ట్ తక్కువగా ఉందని ఎక్కడ పడితే అక్కడ టాటూ ను వేయించుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ అంతగా టాటూ వేయించుకోవాలనుకుంటే ప్రొఫెషనల్ దగ్గర హైజినిక్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.