ముంబై: కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) రిజల్ట్స్, గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. వోలటాలిటీ కనిపించొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముదిరితే ఆయిల్ ధరలు పెరగొచ్చని, మార్కెట్‌లో వోలటాలిటీ పెరగొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ ప్రవీష్ గౌర్ అన్నారు. కంపెనీల క్యూ2 రిజల్ట్స్‌ను జాగ్రత్తగా గమనించాలని ట్రేడర్లకు సలహా ఇచ్చారు.
కన్సాలిడేటెడ్ బేసిస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు క్యూ2 లో రూ. 17,825.91 కోట్ల నికర లాభం వచ్చింది. ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగింది. ఈ బ్యాంక్ రిజల్ట్స్‌కు మార్కెట్ సోమవారం స్పందించనుంది. పెద్ద ఈవెంట్స్ ఏం లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కంపెనీల రిజల్ట్స్‌పై ఫోకస్ పెడతారని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, పేటీఎం, జొమాటో, బజాజ్ ఫిన్సర్వ్, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.