హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తాలూకా నిబంధనలను సడలించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ట్రయల్ కోర్ట్లో పిటిషన్ వేసుకోవచ్చని అవినాష్కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు విచారణ ట్రయల్ కోర్టులో జరుగుతుంది కాబట్టి, అక్కడే చూసుకోవాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Also Read : జగన్ కుటుంబంలో ఆస్తులపై అంతర్యుద్ధం
ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో దేశం విడిచి వెళ్ళొద్దని అవినాష్కు హైకోర్టు షరతు విధించింది. అనుమతి లేకుండా ఏపీలో అడుగు పెట్టవద్దని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో షరతు పెట్టింది. అయితే ఈ బెయిల్ మంజూరు షరతులను ఎత్తివేయాలని ఎంపీ అవినాష్, భాస్కర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలపై వైఎస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ షరతులు సడలించొద్దని సీబీఐ వాదనలు వినిపించింది.