హెచ్ఎండీఏకు అప్లికేషన్ల వెల్లువ.. 10 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు

హెచ్ఎండీఏకు అప్లికేషన్ల వెల్లువ.. 10 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది 39 శాతం అదనంగా అప్లికేషన్లు వచ్చాయని మెట్రో పాలిటన్​ కమిషనర్​ సర్పరాజ్ అహ్మద్ వెల్లడించారు. 2023లో జూన్​నుంచి అక్టోబర్​వరకు 1,884 దరఖాస్తులు రాగా, 2024లో జూన్​ నుంచి అక్టోబరు వరకు 2,332 వచ్చాయని తెలిపారు. ఇది 39 శాతం పెరుగుదలను సూచిస్తోందన్నారు.

దీంతో భవన నిర్మాణ, లే అవుట్ల పర్మిషన్లు సులభతరం చేయడానికి ఇక నుంచి వారం వారం అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసర్​ను నియమించినట్టు తెలిపారు. బుధవారాన్ని బిల్డింగ్​పర్మిషన్ల​జారీ వారంగా ప్రకటిస్తున్నామని, అప్లికేషన్లు వచ్చిన 10 రోజుల్లోగా అనుమతులను జారీ చేయాల్సి ఉంటుందని, ఏ నెలకా నెల అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించామన్నారు.