ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన వెంటనే.. సునీతా విలియమ్స్ను ఎక్కడకు తీసుకెళ్లారంటే..

ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన వెంటనే.. సునీతా విలియమ్స్ను ఎక్కడకు తీసుకెళ్లారంటే..

భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, విల్ మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు భూమి మీదకు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్యాప్సూల్‌‌‌‌ దిగిన కొంతసేపటికి అక్కడి నుంచి సునీతా విలియమ్స్, విల్ మోర్ను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్కు తీసుకెళ్లారు. టెక్సాస్లోని హోస్టన్లో ఉన్న నాసా సెంటర్లోనే ఈ ఇద్దరికీ వైద్య పరీక్షలు చేస్తారు. ఈ ఇద్దరిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏం చేయాలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఓ నిర్ణయానికి వస్తారు. ఎర్త్ గ్రావిటీకి తగినట్టుగా వారిని మార్చడానికి వైద్యుల ప్రయత్నం మొదలవుతుంది.

భారత సంతతి అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఐదోసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.52 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ వీ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్​లో ఆమెతోపాటు మరో ఆస్ట్రోనాట్ కక్ష్యలోకి చేరుకున్నారు. కక్ష్యలో 26 గంటలు జర్నీ చేసిన తర్వాత వారిద్దరూ తమ స్పేస్ షిప్​ను ఐఎస్ఎస్​కు అనుసంధానం చేసి, అందులోకి ప్రవేశించనున్నారని నాసా వెల్లడించింది. అంతరిక్షంలో 286 రోజులు ఉండటంతో బుచ్ విల్​మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. స్పేస్లో గ్రావిటీ ఉండదు. దీంతో ఆస్ట్రొనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు. భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

Also Read:-సునీతా విలియమ్స్ ఇండియాకు ఎప్పుడొస్తుందో చెప్పేసిన ఆమె ఫ్యామిలీ

భూమిపై అడుగుపెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్​సైజ్​లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందిపడొచ్చు. స్పేస్​లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ,  ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయి. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఐదోసారి అంతరిక్షంలోకి చేరుకుని 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.