- పురుగుల అటుకులు, ఉడకని అన్నం పెడుతున్నారంటూ ఆరోపణ
జగిత్యాల టౌన్, వెలుగు: ఆస్పత్రిలో పిల్లలకు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్లో పురుగులు వస్తున్నాయని పేషెంట్ల బంధువులు సోమవారం జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) లో ఆందోళనకు దిగారు. మార్నింగ్ టిఫిన్గా ఇస్తున్న అటుకుల్లో లక్క పురుగులు రావడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కూడా పూర్తిగా ఉడకని అన్నం పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఫుడ్ తింటే పెద్దవాళ్లకే డైజేషన్ ప్రాబ్లమ్స్, కడుపునొప్పి వంటివి వస్తాయని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పిల్లలు తింటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పేషెంట్ల బంధువులు కోరారు.