హైదరాబాద్: జన్వాడా ఫాంహౌజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జన్వాడా రాజ్ పాకాల ఫాంహౌజ్ కేసులో మోకిల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజ్ పాకాల పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో A1 రాజ్ పాకాలా, A2గా విజయ్ మద్దూరి కావడం గమనార్హం. విజయ్ మద్దూరి నేడు పోలీస్ విచారణకు హాజరు కానున్నాడు. విజయ్ మద్దూరికి ఇప్పటికే కొకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాను డ్రగ్ కన్జ్యూమర్ని అని పోలీసులకు విజయ మద్దూరి చెప్పారు. సెక్షన్ 25,27,29 NDPS, 3,4 TSGA యాక్ట్ కింద మోకిల పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఓరియన్ విల్లాస్తో పాటు రాజ్ పాకాల శైలేందర్ పాకాల, నాగేశ్వర్ రెడ్డి ఇండ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓరియన్ విల్లాస్లో విల్లా నంబర్ 5, 40,43లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 53 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జన్వాడ ఫాం హౌజ్లో కూడా భారీగా విదేశీ, స్వదేశీ మద్యం దొరికిన సంగతి తెలిసిందే. 34(a)34(1)9(1) ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో దావత్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతున్నదంటూ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ సోదాలు చేశారు. భారీగా లిక్కర్ దొరికింది. ఇందులో 12 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ కూడా పట్టుబడ్డాయి. పార్టీలో 40 మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించారు.
22 మందికి డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి డ్రగ్స్ (కొకైన్) తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్ను ఇచ్చింది రాజ్ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్ మద్దూరి వెల్లడించాడు. తనకు డ్రగ్స్ను ఇచ్చింది రాజ్ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్ మద్దూరి వెల్లడించాడు. రాజ్ పాకాల పరారీలో ఉన్నాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.