ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడల్స్

హైదరాబాద్, వెలుగు: జాతీయ రెజ్లింగ్ చాంపియన్ షిప్–2024లో ఎస్సీ గురుకుల విద్యార్థులు మెరిశారు. రెజ్లింగ్ లో పలువురు స్టూడెంట్లు గోల్డ్, బ్రాంజ్ పతకాలు గెలిచినట్టు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల  లష్కీపెట్ గురుకుల స్టూడెంట్ భువనేశ్వరి బ్రాంజ్ మెడల్ గెలవగా, లావణ్య, సృజన, శిరీష లు అండర్ 15 కేటగిరిలో రజత పతకాలు గెలిచారని ఆమె వెల్లడించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి గురుకులానికి చెందిన లక్ష్మి ప్రియ 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా కోచ్ దాసరి ప్రియాంకను సెక్రటరీ అభినందించారు.