వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్  జైన్పై దాడి జరిగిన క్రమంలో ఆయనకు భద్రతను పెంచారు. కలెక్టర్కు అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లను పోలీస్ శాఖ కేటాయించింది. ఇండస్ట్రియల్​ కారిడార్​ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్  జైన్పై లగచర్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. వికారాబాద్​ జిల్లా దుద్యాల, లగచర్ల, పోలేపల్లిలోని 1,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్​కారిడార్​ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 

మొదట ఫార్మా విలేజ్​ఏర్పాటు చేద్దామని అనుకున్నా స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇండస్ట్రియల్​కారిడార్​ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే దుద్యాలలో అధికారులు గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్​ ప్రతీక్ ​జైన్, అడిషనల్​కలెక్టర్​ లింగ్యా నాయక్, సబ్​కలెక్టర్​ఉమాశంకర్​ప్రసాద్, కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డితో పాటు ఇతర అధికారులు వచ్చారు. అయితే, గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. గంట సేపటివరకూ వారి కోసం వేచిచూసినా రాలేదు. 

ALSO READ | కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా.. DNA పరీక్ష చేయించుకో: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

అప్పుడే కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ దగ్గరకు బీఆర్ఎస్ లీడర్​ మొగవోని సురేశ్​వచ్చారు. ‘సార్.. రైతులందరూ లగచర్లలో ఉన్నారు. అక్కడే టెంట్ వేశాం. మీరు అక్కడికి వస్తే మాట్లాడొచ్చు’ అని నమ్మించాడు. దీంతో కలెక్టర్, అడిషనల్​కలెక్టర్, సబ్​కలెక్టర్, కడా స్పెషల్ ​ఆఫీసర్​వారి వారి కార్లలో 5 కిలోమీటర్ల దూరంలోని లగచర్లకు వెళ్లారు. గ్రామంలోని రామాలయం దగ్గరకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులు కారు దిగి, రైతులతో మాట్లాడడం మొదలెట్టారు. వెంటనే ఓ పక్క నుంచి 20 నుంచి 30 మంది వరకు కలెక్టర్​పైకి  తోసుకుంటూ వచ్చారు.

దాడికి దిగుతున్నారని గుర్తించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్.. కలెక్టర్​ను కారు దగ్గరకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఇతర అధికారులపై దాడి చేయబోతున్నారని గమనించిన కలెక్టర్..​ వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే కలెక్టర్​ను ఆయన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్​ కారు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లబోయారు. ఈ దశలో ఆయన వాహనంపై దాడి చేశారు. వెనుక అద్దాలపై రాళ్లు వేయడంతో, అవి పగిలిపోయాయి. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్నారు.