
గచ్చిబౌలి, వెలుగు: చెవులు చిల్లులు పడేలా మ్యూజిక్ పెట్టిన వ్యక్తిని సౌండ్ ఆపమని అడిగినందుకు కుర్చీతో దాడి చేశాడు. ఐటీ కారిడార్ పరిధిలోని ఖాజాగూడ బ్లూమ్ ఫీల్డ్ విల్లా నంబరు16లో సూర్య అనే వ్యక్తి ఉంటున్నాడు. పక్కనే ఉన్న విల్లా నంబరు 6లో రాజేంద్రన్ ప్రతిరోజూ ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ పెడుతున్నాడు. దీంతో చదువుకునేందుకు ఇబ్బందిగా ఉందంటూ సూర్య, అతని కుమారుడు కలిసి ఆదివారం రాజేంద్రన్ విల్లాకు వెళ్లారు. దీంతో రెచ్చిపోయిన రాజేంద్రన్ అక్కడే ఉన్న కుర్చీతో సూర్య మీద దాడి చేశాడు. ఈ దాడిలో సూర్య తలకు గాయం కావడంతో బాధితుడి భార్య రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.