NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్

NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్.. నీల్(NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ పూజా ఈవెంట్ జరిగిన దగ్గర నుండి.. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిన చాలనేలా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ బయటకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. 

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ నెల జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం. అంటే సంక్రాంతి తరవాత ప్రారంభం కానుందన్నమాట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎన్టీఆర్ షూట్లో జాయిన్ కానున్నట్లు టాక్.

అయితే, ఇందులో ఎన్టీఆర్కి జోడిగా రుక్మిణీ వసంత్ నటిస్తుంది. అలాగే రెండు కీలక పాత్రలకోసం మలయాళం నుంచి టోవినో థామస్, బీజూ మీనన్ లను నీల్ ఎంపిక చేశారు. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ బయటకి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్ల‌ర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!

బ్యూటీ రుక్మిణీ వసంత్.. ఇప్పటికే ‘777 చార్లీ’ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తన సహజ నటనతో, తనదైన ఎమోషన్స్ ను పలికించి అటు కన్నడలో, ఇటు తెలుగులో బాగా గుర్తింపు పొందింది. దీంతో నీల్ ఈ రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్‌‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ డ్రాగన్ నిర్మిస్తోంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హిందీలో ‘వార్‌‌‌‌ 2’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.  ఈ చిత్రం 2025 ఆగస్టు 14న రిలీజ్ కానుంది.