నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు ( నవంబర్ 11 వరకు) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. .తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. హైదరాబద్ లో ఒక్కసారిగా చలి పెరిగింది. తెల్లవారు జాము నుంచి చలికి తట్టుకోలేక ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మార్నింగ్ వాకర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటకు రావాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధులు సులువుగా సంక్రమిస్తాయని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో నవంబర్ 11 వరకు నాలుగు రోజుల పాటు మోస్తరు నంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడి.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షాలతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వాటి నుంచి తమను తామే రక్షించుకునేందుకు ప్రజలు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.