
హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. కుండపోత వాన పడింది. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదని.. మరో నాలుగు రోజులు ఇదే విధంగా వర్షాలు పడొచ్చని హెచ్చరిస్తుంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో.. మరో నాలుగు రోజులు అంటే.. 2025, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని.. ఆ గాలుల వేగం గంటకు 40 నుంచి -50 కిలోమీటర్లతో ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీతోపాటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆరంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు.
వర్షాలతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయని.. 2 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదు కానున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. రాబోయే నాలుగు రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్ మెంట్..
Also Read : హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలు, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లతో వర్షం పడే సూచనలు ఉన్నాయని.. రైతులు, ప్రజలు వర్షం పడే సమయంలో బయటకు రావొద్దని హెచ్చరించారు అధికారులు.
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం మొత్తం చిరు జల్లులు ఉంటాయని.. కొన్ని చోట్ల వడగండ్లు.. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు.. ఇలా మరో నాలుగు రోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.