వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజా వాట్సాప్ తన ఫ్లాట్ ఫారమ్ అప్ గ్రేడ్ చేసింది. ఇప్పుడు వినియోగదారులు హై డెఫినిషన్ (HD) ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి అనుమతిస్తుంది. iOSవెర్షన్ ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలషేరింగ్ ని ఎనేబుల్ చేసే అప్ డేట్ ను తీసుకొస్తుంది. వాట్సాప్ స్టేటస్ కు కూడా HD నాణ్యత గల ఫొటోలు, వీడియోలను షేరింగ్ ను విస్తరించాలని యోచిస్తోంది.
ఆండ్రాయిడ్ కోసం బీటా వెర్షన్ 2.23.26.3లో వాట్సాప్ స్టేటస్ విభాగానికి ఈ ఫీచర్ ద్వారా HDసపోర్ట్ ను ఇస్తుంది. వాట్సాప్ లో స్టేటస్ ప్రాంతంలో HD ఫొటోస్, వీడియో షేరింగ్ ఫీచర్ ను ఐకాన్ వస్తుంది. ఇది నొక్కితే హై డెఫినిషన్ ఫొటోలు, వీడియోలను స్టేటస్ లో షేర్ చేయొచ్చు. గతంలో స్టేటస్ అప్ డేట్ చేయడానికి వినియోగదారులు.. తక్కువ రిజల్యూషన్ వీడియోలు, ఫొటోలను షేర్ చేయాల్సి వచ్చేంది.
ఒకవేళ హై డిఫినిషన్ ఫొటోలను స్టేటస్ లో పెట్టాలని వాటిని వాట్సప్ కి అకౌంట్ కి షేర్ చేయాల్సి వచ్చేది. అది నమ్మదగిన పరిష్కారం కాదు. స్టేటస్ విభాగంలో కొత్త HDసపోర్ట్ తో వినియోగదారులు తమ స్టేటస్ ను హెచ్ డీ క్వాలిటీలో షేర్ చేయాల వద్దా అని ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంది.
ప్రస్తుతం ఈ HD ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎంపిక చేయబడిన బీటా టెస్టర్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ ఫీచర్ ను బీటా ఫేజ్ మినహా ఇతర వినియోగదారులకు అందుబాటులో లేదు.. త్వరలో మరిన్ని బీటా టెస్టర్లకు విస్తరించాలని వాట్సాప్ భావిస్తోంది.
ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలి
- మొదట గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ కోసం సెర్చ్ చేయాలి.
- బీటా టెస్టర్ అవ్వండి అనే విభాగం కోసం వాట్సాప్ పేజీలో కిందికి స్క్రోల్ చేయాలి.jOIN క్లిక్ చేయాలి.
- బీటా టెస్టర్ అయిన తర్వాత అప్ డేట్ కోసం వేచి ఉండాలి.
- మీ ఫోన్ లో వాట్సాప్ బీటాను ఇన్ స్టాల్ చేయడానికి Update డౌన్ లోడ్ చేయాలి.