Good Health : హాయిగా నవ్వండి.. నవ్వుతూ ఉండండి.. మతిమరుపును మాయం చేసుకోండి.. నమ్మటం లేదా.. ఇది నిజం..!

హాయిగా నవ్వడంలో ఉన్న ఆనందం వెల కట్టలేనిది. ముఖానికి ఒక పెట్టని ఆభరణం లాంటిది నవ్వు. అందుకే 'నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం' అంటారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు నవ్వు ఔషధం. నవ్వుతో ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఇవే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. ఇదే విషయాన్ని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ మెదడు పనితీరును దెబ్బ తీస్తుంది. దీంతో మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఇదంతా జరగకుండా ఉండాలంటే.. రోజూ నవ్వాలని చెబుతున్నారు. సైంటిస్టులు. రోజూ ఆనందంగా నవ్వడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుందని, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు కాలిఫోర్నియాలోని 'లోమా లిండా' యూనివర్సిటీ పరిశోధకులు. 

ALSO READ | Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..

కార్టిసాల్ వంటి హార్మోన్ల ప్రభావం, ఒత్తిడి, బీపీ తగ్గేందుకు, రక్తసరఫరా మెరుగుపడేందుకు, ఉత్సాహం వచ్చేందుకు నవ్వు ఎంతో దోహదపడుతుందని వాళ్లు పేర్కొంటున్నారు. నవ్వడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును పెంచుతాయి. దీంతో క్రమంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.