
హైదరాబాద్, వెలుగు: కొలాబరేటివ్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్ ఫౌండేషన్ (సీఏఐఆర్ఎల్) హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ప్రారంభం అయ్యింది. సమాజం కోసం బాధ్యతాయుత ఏఐ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్య, పరిశ్రమ రంగాలు, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని పెంచడం సీఏఐఆర్‌ఎల్ టార్గెట్. ఈ ఈవెంట్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌ను ఏఐ ట్యాలెంట్‌కు గ్లోబల్ కేంద్రంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు.