గద్వాలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభం: దీపక్ కుమార్

గద్వాల, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను  జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జోనల్ మేనేజర్ దీపక్ కుమార్ శ్రీ వాస్తవ్, సర్కిల్ హెడ్ ఎన్ వీఎస్ ప్రసాద్ రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్​ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  హైదరాబాద్ సర్కిల్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 69వ శాఖను గద్వాలలో ఓపెన్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. 

బ్యాంక్ ఓపెనింగ్ సందర్భంగా 4.5 కోట్ల రుణాలను మంజూరు   చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శివమోహన్, వెంకన్న, రమణమూర్తి, ఎల్ డీఎం అయ్యప్ప రెడ్డి, గద్వాల వీవర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులు, బిల్డింగ్ ఓనర్ డీఆర్ శ్రీధర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.