ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్​ను ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అన్ని రకాల సేవలు అందించే బ్యాంక్ పట్టణంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని 30 బెడ్ల దవాఖానాను త్వరలోనే 50 బెడ్లకు అప్ గ్రేడ్ చేస్తామన్నారు. పీఏసీఎస్ చైర్మన్ రాజేష్​కన్నా, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, వైస్​చైర్మన్​ ఏలేందర్​రెడ్డి తదితరులున్నారు.
షర్మిలను విమర్శించే స్థాయి ఎంపీ, మంత్రికి లేదు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వైఎస్ ఆర్టీపీ ప్రెసిడెంట్ వైయస్ షర్మిలను విమర్శించే స్థాయి ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ కు లేదని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సునీత మంగీలాల్ స్పష్టం చేశారు. ఎంపీ కవిత తండ్రి రెడ్యా నాయక్​కు రాజకీయ జీవితం ఇచ్చిందే వైయస్ఆర్ అని గుర్తు చేశారు. వైయస్ఆర్ పెట్టిన భిక్ష వల్లే నేడు పదవులు అనుభవిస్తూ.. వైయస్ఆర్ తనయను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ లీడర్లపైనే మానుకోట రాళ్లు పడతాయని హెచ్చరించారు.

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక

మహబూబాబాద్​అర్బన్, వెలుగు: తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మనోహర్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మహబూబాబాద్ టౌన్ లోని ఐఎంఏ భవన్​లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కొత్త కమిటీని ప్రకటించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా లాలూ నాయక్, ఉపాధ్యక్షులుగా రవి మూడ్, శ్రీను బోడ, ట్రెజరర్ గా శ్రీను బోడ, సెక్రటరీగా శ్రీను బానోత్, జాయింట్ సెక్రటరీలుగా సీతారాం మాలోత్, శ్రీను తేజవత్..  పాలకమండలి సభ్యులుగా నరేందర్, తిరుపతిని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ..  గిరిజన జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్, డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని కోరారు. గిరిజన బంధులో జర్నలిస్టులకు అవకాశం కల్పించాలన్నారు.

కరాటేలో బాలికలకు ఉచిత శిక్షణ

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్​లో కరాటేలో బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్పోర్ట్స్ అండ్​ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజ్ వెల్లడించారు. గురువారం నిర్వహించిన క్లబ్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆడ పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ్నారు. స్టేషన్ ఘన్ పూర్ లోని గర్ల్స్ హైస్కూల్​లో ఈ నెల 15న ఉదయం 6గంటలకు ఫ్రీ ట్రైనింగ్ ను ప్రారంభిస్తామన్నారు. ఆసక్తి ఉన్న బాలికలు అడ్మిషన్లు తీసుకోవాలన్నారు. 

కారు, ఆటో ఢీ.. ఒకరు మృతి, మరోనలుగురికి గాయాలు

రేగొండ, వెలుగు: కారు, ఆటో ఢీకొన్న సంఘటలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల శివారులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన ఆకుల రవి తన ఆటోలో అదే గ్రామానికి చెందిన బొడ్డు కోమల, రజిత, సొమిడి బొందమ్మ, శీల ఐలమ్మను ఎక్కించుకుని పరకాలకు బయలుదేరాడు. రేగొండ మండలం చెన్నాపూర్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు, అతివేగంతో ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ రవితో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరంగల్​ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో శీల ఐలమ్మ(50) చనిపోయింది. 

యువతి ఆత్మహత్య..

వర్ధన్నపేట: క్షణికావేశంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్​జిల్లా వర్ధన్నపేట పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పోడిశెట్టి రమ, గిరి దంపతుల చిన్నకూతురు పూజ(19) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం సాయంత్రం తల్లి మందలించడంతో క్షణికావేశంలో తమకున్న కిరాణం షాపులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వడ్లు ఇంకెప్పుడు కొంటరు?
హైవేపై రైతుల ధర్నా

నర్సంపేట, వెలుగు: కోతలు పూర్తై, నెల రోజులు కావొస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా కొనలేదని నర్సంపేట మండలం ఇటుకాలపల్లి రైతులు ఆరోపించారు. సర్కారు తీరును నిరసిస్తూ గురువారం హైవేపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వడ్లు కుప్పలు పోసి, రేయింబవళ్లు కాపలా కాస్తున్నా ఆఫీసర్లు కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయడం లేదన్నారు.

చేసింది ఏమీ లేక మిల్లర్లకు అమ్ముకుంటే తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోగా.. తహశీల్దార్ వాసం రాంమూర్తి, టౌన్​సీఐ పులి రమేశ్​అక్కడికి చేరుకున్నారు. ఐకేపీ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని, అవకతవకలు పాల్పడే రైస్​ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు.

వామ్మో పన్నులు

మరిపెడ, వెలుగు: మున్సిపల్ పన్నులతో విలీన గ్రామాలతో పాటు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ పన్నులు మరింత పెరగడంతో లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో గురువారం వ్యాపారులు భారీ ర్యాలీ తీసి, పన్నులు తగ్గించాలని కమిషనర్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. టౌన్​ను తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు.  

బీజేపీ శ్రేణుల సంబురాలు

వెలుగు నెట్ వర్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  

పేషెంట్లకు ఫ్రీ ట్రీట్మెంట్

కాశిబుగ్గ, వెలుగు: హనుమకొండలోని అజర హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్లు 14 మందికి ఉచిత వైద్యం అందించి ఉదారత చాటుకున్నారు. హాస్పిటల్​మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బండారి శివసుబ్రమణ్యం, సీఈవో తౌటి వెంకటేశ్​మాట్లాడుతూ.. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.

గురువారం నుంచి 14వ తేదీ వరకు ఉచిత టెస్టులతో పాటు ఓపీ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందిస్తున్నామన్నారు. రక్త, మూత్ర, గుండె టెస్టులతో పాటు షుగర్, బీపీ టెస్టులు ఉచితంగా చేయనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 0870 2959555, 0870 29050555, 9391009701/102 నెంబర్లకు కాల్ చేయాలన్నారు.

భద్రాకాళి ఆదాయం రూ.72.33 లక్షలు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. 78 రోజులకు సంబంధించిన హుండీని గురువారం లెక్కించగా.. రూ.72,33,865 ఆదాయం వచ్చింది. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, మిశ్రమ వెండిని  తిరిగి హుండీలోనే వేశారు. కాగా, ఇందులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ  ఉండడం గమనార్హం. 658 యూఎస్ డాలర్లు,10 సింగపూర్ పౌండ్లు, 15 సౌదీ అరేబియా రియాల్స్, 10 యూరోలు, 50 ఆస్ట్రేలియా డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 1/4 దినార్స్ లభించాయి. ఎండోమెంట్ అబ్జర్వర్ టి.సాయిబాబా, ఈవో  కె.శేషు భారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు తదితరులున్నారు.

ఫిజికల్​ టెస్టులు ప్రారంభం

మొదటి రోజు 233 మంది పాస్​

హనుమకొండ, వెలుగు: పోలీస్​ఉద్యోగాల నియామకాల్లో భాగంగా కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్​ లో గురువారం ఉదయం ఫిజికల్​ టెస్టులు ప్రారంభమయ్యాయి. వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ ఈవెంట్స్ ను ప్రారంభించారు. తొలి రోజు 600 మంది అభ్యర్థులకు గాను 510 మంది హాజరు కాగా.. అందులో 233 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు పొందేందుకు సహాయపడతామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దన్నారు.

ఈవెంట్స్ పూర్తి పారదర్శకంగా జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు సంజీవ్, సురేశ్​ కుమార్​, ఏసీపీలు  నాగయ్య, సురేంద్ర, జనార్ధన్ రెడ్డి, కృపాకర్, సాంబయ్య, అనంతయ్య వివిధ విభాగాల అధికారులు 
పాల్గొన్నారు.

18న హనుమకొండకు కైలాస్​ సత్యర్థి

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఈ నెల 18,19 తేదీల్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి హనుమకొండకు రానున్నట్లు చీఫ్  విప్ వినయ్ భాస్కర్  వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్​ హాలులో రాష్ట్ర ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ బి.వినోద్​ కుమార్​ తో కలిసి ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కైలాస్ సత్యర్థి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆఫీసర్లను కోరారు.

బాలికా విద్య, బాలకార్మిక  వ్యవస్థ, హక్కులపై పలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా 18న  కైలాస్ సత్యర్థి అదాలత్ లోని పోక్సో కోర్ట్ ను సందర్శిస్తారన్నారు. 19న చిన్నారులతో కలసి  వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, సీపీ రంగనాథ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ కైలాస్ ఫౌండేషన్ ప్రతినిధి చందన ఉన్నారు.

​వైభవంగా అయ్యప్ప పల్లివేట

నర్సంపేట, వెలుగు: నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఏటా పల్లివేట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద పల్లివేట ఇక్కడే జరుగుతుంది. గురువారం సైతం అయ్యప్ప మాలధారులు పల్లివేటను వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి మణికంఠ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని చతురంగ బలగాలతో ఊరేగింపుగా మున్సిపల్ ఆఫీసులోని పుంగా వనానికి తీసుకెళ్లారు.

తిరుపతికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీమాన్​వెంకటేశ్వర శర్మ.. స్వామి వారికి అష్టాభిషేకాలను నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నియోజకవర్గ నాయకుడు డాక్టర్​ గోగుల రాణాప్రతాప్​రెడ్డి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇయ్యాల కూడా పల్లివేటను ఘనంగా నిర్వహించేందుకు స్వాములు ఏర్పాట్లు చేస్తున్నారు.

మళ్లీ వెలసిన గూడారాలు 

కమలాపూర్, వెలుగు: ప్రభుత్వ జాగల్లో పేదలు గూడారాలు వేసుకున్నకొద్దీ ఆఫీసర్లు తొలగిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని సర్వే నెంబర్ 895లో గురువారం పేదలు గూడారాలు వేసుకున్నారు. వీరికి సీపీఐ లీడర్లు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి స్పష్టం చేశారు.
 

కాలుష్య కోరల్లో భూపాలపల్లి పెద్ద చెరువు
దగ్గరుండి చెరువులోకి మురుగు నీరు విడుదల చేస్తున్న ఆఫీసర్లు

చర్మ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
500 ఎకరాల పంట సాగు ప్రశ్నార్థకం

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఖాసీంపల్లి పెద్ద చెరువు ఒకప్పుడు తెల్లటి నీటితో కళకళలాడుతుండేది. పిల్లలు ఈత కొడుతూ, మత్స్యకారులు చేపలు పడుతూ కనిపించేవారు. ఈ చెరువు పశుపక్షాదుల దాహార్తిని తీర్చేది. 500 ఎకరాలకు సాగు నీరు అందించేది. స్థానికులు బట్టలు పిండుకోవాలన్నా.. ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా ఈ చెరువే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఆఫీసర్ల తీరుతో మంచి నీటి చెరువు కాస్త మురికి కూపంలా మారింది. దగ్గరికి వెళ్తేనే ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. మత్య్సకారులకు జీవనోపాధి దూరం కాగా.. పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

చెరువులోకే మురికి కాలువలు..

భూపాలపల్లి మున్సిపాలిటీలో దాదాపు లక్ష జనాభా ఉంటుంది. జిల్లా కేంద్రం అయ్యాక అభివృద్ధి చెందుతోంది. పట్టణ పరిధిలో ఉన్న మురుగు కాలువలను ఖాసీంపేట చెరువుకే మళ్లిస్తున్నారు. దాదాపు 75శాతం మురుగు నీరు ఈ చెరువులోనే వచ్చి చేరుతోంది. కలుషిత నీటిని అరికట్టాల్సిన ఆఫీసర్లు.. కాలువలను తవ్వి, నేరుగా చెరువులోకే వదులుతున్నారు. దీంతో స్వచ్ఛంగా ఉండాల్సిన నీళ్లు రంగు మారాయి. దగ్గరికి వెళ్తేనే కంపు కొడుతోంది.

ఒక్క ప్లాంట్ లేదు..

మురుగు నీటిని శుద్ధి చేసేందుకు భూపాలపల్లిలో ఒక్క సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కూడా లేదు. మున్సిపాలిటీగా మారాక అలాంటి ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు.  పట్టణంలోని కారల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ, మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెడ్డి కాలనీ, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుభాష్​కాలనీ, కాకతీయ కాలనీలకు చెందిన మురుకి నీరంతా నిత్యం పెద్ద చెరువులోనే కలుస్తోంది. ఆఫీసర్లు మెయిన్ రోడ్ వెంట తవ్విన ప్రధాన కాలువను సైతం నేరుగా చెరువులోకే కనెక్షన్ ఇచ్చారు.

కలవరపెడుతున్న చర్మ వ్యాధులు..

పెద్ద చెరువు నీరు తాకిన పిల్లలకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, ఖాసీంపల్లి, జంగేడు తదితర గ్రామాలకు చెందిన పది మందికిపైగా పిల్లలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. గత ఐదారు నెలలుగా చికిత్స చేయిస్తున్నా వ్యాధి తగ్గడం లేదు. వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఫలితం లేదు. స్కూళ్లలో తోటి పిల్లలు హేళన చేస్తుండడంతో బడి కూడా మానేశారు.

మరోవైపు చెరువులోని చేపలు తినడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో మత్స్యకారులకు గిరాకీ లేకుండా పోయింది. చెరువులోకి దిగి చేపలు పడుతున్న మత్స్యకారులకు సైతం వ్యాధులు ప్రబలుతున్నాయి. వ్యాధుల విషయాన్ని డాక్టర్లు సైతం ధ్రువీకరిస్తున్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు.

పిల్లలకు చర్మవ్యాధులొస్తున్నాయి..!

పెద్ద చెరువు కలుషితం కావడం వల్ల పిల్లలకు చర్మవ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికే మూడు, నాలుగు గ్రామాలకు చెందిన పది, పదిహేను మంది పిల్లలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా తగ్గడం లేదు. పిల్లల తల్లితండ్రులు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజులు, మందుల కోసం వేలల్లో ఖర్చు పెడుతున్నారు. ‒ సెగ్గం శ్యాం, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గడ్డిగానిపల్లి 

ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించాం!

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మురికినీళ్లను శుభ్రం చేయడానికి 3 సీవెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ)లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.3 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించాం. నిధులు మంజూరు కాగానే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 ఇంక్లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జంగేడు, హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీలను ఏర్పాటు చేసి మురికినీళ్లను శుభ్రం చేసి పంపిస్తాం. ‒అవినాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్​చార్జి కమిషనర్, భూపాలపల్లి మున్సిపాలిటీ