పుష్పక్​ ప్రయోగం విజయవంతం

పుష్పక్​ ప్రయోగం విజయవంతం

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్​ టెస్ట్​ రేంజ్​(ఏటీఆర్​) నుంచి ఇస్రో నిర్వహించిన పునర్వినియోగ వాహక నౌక పుష్పక్​ ప్రయోగం మూడోసారి విజయవంతమైంది. స్వదేశీ స్పేస్​ షటిల్​గా పిలిచే ఈ వాహక నౌక ప్రయోగాన్ని ఈసారి మరింత కఠిన పరిస్థితుల్లో నిర్వహించింది. నింగిలోకి ప్రయోగించే ఉపగ్రహాల విడిభాగాలు, వాటిని తీసుకెళ్లే వాహక నౌక(స్పేస్​షిప్​)ల పునరుద్ధరణ దిశగా ఇస్రో పుష్పక్​ ప్రాజెక్ట్​ను చేపట్టింది.

 ఈ ప్రయోగం రీయూజబుల్​ లాంచ్​ వెహికిల్​(ఆర్​ఎల్​వీ) అభివృద్ధికి అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఙానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పింది. ఇంతకుముందు నిర్వహించిన రెండు ప్రయోగాలు విజయవంతం కాగా, మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో చేపట్టింది. స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్​ సామర్థ్యాన్ని పుష్పక్​ మళ్లీ ప్రదర్శించింది. 

    పుష్పక్​ను ఇండియన్​ నేవీకి చెందిన చినూక్​ హెలికాప్టర్​ ద్వారా నింగిలోకి తీసుకెళ్లి రన్​వేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జార విడిచారు. అనంతరం తనంతటతానుగా క్రాస్​ రేంజ్​ కదిలికలను నియంత్రిస్తూ పుష్పక్​ రన్ వే దిశగా వచ్చి సెంటర్​ లైన్​ వద్ద కచ్చితమైన సమాంతర ల్యాండింగ్​ను ప్రదర్శించింది.
    తక్కువ లిఫ్ట్​ టుడ డ్రాగ్​ నిష్పత్తితో కూడిన ఏడో డైనమిక్​ కాన్ఫిగరేషన్​ వల్ల పుష్పక్​ ల్యాండింగ్​ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే 
ఎక్కువగా ఉంది.