కొత్త ఫోన్ కొన్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ కొంత కాలానికి ఉండదు. అదే స్క్రీన్, అవే ఆప్షన్స్ చూసి చాలామంది బోర్ ఫీలవుతుంటారు. స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలంటే లాంచర్లు వాడాలి. ఫోన్‌లో లాంచర్ మారిస్తే ఫోన్ లుక్, ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి. అలాంటి లాంచర్లలో కొన్ని ఇవి.
రేషియో లాంచర్: ఫోన్‌ను సింపుల్‌గా వాడాలనుకునే వాళ్లు రేషియో లాంచర్ ట్రై చేయొచ్చు. ఈ లాంచర్ థీమ్ పూర్తిగా గ్రే అండ్ బ్లాక్ రంగుల్లో ఉంటుంది. ఇందులో యాప్‌లు అన్ని అల్ఫాబెటిక్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. లైఫ్‌స్టైల్, మెసేజింగ్, ప్రొడక్టివిటీ, పేమెంట్స్, షాపింగ్.. ఇలా కేటగిరీలుగా యాప్‌లను డివైడ్ చేసుకోవచ్చు.
నయాగరా లాంచర్: ఈ లాంచర్‌లో యాడ్స్ ఉండవు. ఇందులో ఐకాన్స్, విడ్జెట్స్, నోటిఫికేషన్స్, యాప్‌లు నచ్చిన చోట సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కూడా హోమ్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. అవసరం లేని నోటిఫికేషన్స్‌ను ఆటోమేటిగ్గా ఫిల్టర్ చేయొచ్చు. నచ్చిన యాప్స్, తరచుగా వాడే యాప్స్‌ను ప్రియారిటీ ఆధారంగా చూపిస్తుంది ఈ లాంచర్. కలర్స్ థీమ్స్‌లో కూడా బోలెడు ఆప్షన్లు ఉన్నాయి.
సూపర్ స్టేటస్ బార్: మొబైల్ స్క్రీన్‌కు పైన ఉండే స్టేటస్ బార్ లేదా నోటిఫికేషన్ ప్యానెల్‌ను మార్చాలనుకుంటే సూపర్ స్టేటస్ బార్ ట్రై చేయొచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్స్, బ్రైట్‌నెస్ కంట్రోల్స్ నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు, నోటిఫికేషన్లు బ్రౌజింగ్ ట్యాబ్స్, బ్యాటరీ లైఫ్, గెశ్చర్ కంట్రోల్ వంటి వాటిని స్టేటస్ బార్ నుంచే మానిటర్ చేసుకోవచ్చు.