భారత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా సరికొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ "బ్లేజ్ డుయో( Lava Blaze Duo)"ను లాంచ్ చేసింది. ఫోన్ ఇరువైపులా డిస్‌ప్లే ఉండటం దీని ప్రత్యేకత. సోమవారం(డిసెంబర్ 16) దీన్ని బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్లేజ్ డుయోలో నోటిఫికేషన్ల కోసం వెనుకవైపు సెకండరీ డిస్‌ప్లేతో సహా వినూత్న డ్యూయల్ స్క్రీన్ డిజైన్ అందించారు. అందునా, ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో గమనార్హం.
6.67-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చిన లావా బ్లేజ్ డుయోలో మీడియాటెక్ 7025 చిప్‌సెట్ అందించారు. రిఫ్రెష్ రేట్ 120Hzగా ఉంది. 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే మొబైల్ ప్రియులను ఆకట్టుకోనుంది. ఈ మొబైల్‌లో ప్రధాన ఫీచర్.. సెకండరీ డిస్‌ప్లే. వెనుకవైపు స్మార్ట్‌వాచ్‌ల్లా నోటిఫికేషన్ల కోసం 1.58-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ అందించారు. కాల్స్ స్వీకరించడానికి, నోటిఫికేషన్లు చూడటానికి సెకండరీ డిస్‌ప్లే బాగా ఉపయోగపడుతుంది.
లావా బ్లేజ్ డుయో ఫీచర్స్
- 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే.
- మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్
- వెనుకవైపు 1.58-అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లే.
- వెనుక కెమెరా: 64MP
- ఫ్రంట్ కెమెరా: 16MP
- 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5,000mAh బ్యాటరీ
ధర..?
లావా బ్లేజ్ డుయో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
- 6GB RAM + 128GB వేరియంట్ ధర: రూ 16,999
- 8GB RAM + 128GB వేరియంట్ ధర: రూ 17,999
సేల్ డిసెంబర్ 20న అమెజాన్‌లో ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకొని రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.