టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య పిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని హైదరాబాద్ లోని నార్సింగిలో ఫిర్యాదు చేశారు లావణ్య. వివరాల్లోకి వెళితే.. రాజ్ తరుణ్, లావణ్య గత 11 ఏళ్లుగా రిలేషన్లో ఉంటున్నారట గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య. ఇద్దరము ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని ఆమె తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు.
ప్రస్తుతం రాజ్ తరుణ్, మాల్వి తిరగబడరా సామి అనే సినిమాలో కలిసి నటిస్తున్నారని, ఇక అప్పటినుండి తనను పెట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. మాల్విని కలవడానికి రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లడం, రాజ్ తరుణ్ ను కలవడానికి మాల్వి హైదరాబాద్ రావడం తరుచుగా జరుగుతోందని, అందుకే.. కొంత కాలంగా రాజ్ తరుణ్ తాను దూరం పెడుతున్నాడు పేర్కొంది లావణ్య. ఇక తమ రిలేషన్ కు అడ్డువస్తున్నాని తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించి 45 రోజులు జైల్లో ఉండేలా చేశారని తెలిపారు. కాబట్టి.. తనకు న్యాయం జరిగేలా చేయాలని ఫిర్యాదులో కోరారు లావణ్య. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేపట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.