లావణ్య​ కేసులో బిగ్​ ట్విస్ట్​: న్యాయం చేయకపోతే నార్సింగ్​ పీఎస్​ ఎదుటే ప్రాణాలు విడుస్తా..!

లావణ్య​ కేసులో బిగ్​ ట్విస్ట్​: న్యాయం చేయకపోతే నార్సింగ్​ పీఎస్​ ఎదుటే ప్రాణాలు విడుస్తా..!

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ , లావణ్య   కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది.  ఈ మధ్య ఈ కేసు విషయంలో ఎలాంటి హడావిడి లేకపోయినా..ఇప్పుడు నార్సింగ్​ పోలీస్​ స్టేషనుకు లావణ్య వెళ్లడంతో మళ్లీ హాట్​ టాపిక్​ గా మారింది.   రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు .. వారి అనుచరులపై ఫిర్యాదు చేసింది.  రాత్రి సమయంలో కొంతమంది తన ఇంటి కి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:-పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చెలరేగిన మంటలు

రాజ్​ తరుణ్​..  అతడి తల్లిదండ్రులపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని లావణ్య ఆరోపిస్తుంది. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని..  తనకు పోలీసులు న్యాయం చేయకపోతే  స్టేషన్​ ఎదుటే ప్రాణాలు విడుస్తానని చెబుతుంది లావణ్య.లావ‌ణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వ‌దిలి వెళ్లాల‌ని రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు  వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విష‌యంలో రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు త‌న‌మీద 15 మందితో క‌లిసి ఒకేసారి దాడికి దిగార‌ని లావ‌ణ్య ఆరోపించింది. తాజాగా ఇదే విష‌యంపై కంప్లయింట్ ఇవ్వడానికి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసుల‌ను ఆశ్రయించింది.