మస్తాన్​ సాయిలాగే.. రాజ్​తరుణ్ను జైలుకు పంపిస్తా: లావణ్య

మస్తాన్​ సాయిలాగే.. రాజ్​తరుణ్ను జైలుకు పంపిస్తా: లావణ్య

గండిపేట, వెలుగు: సినీ హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు తన ఇంటికి వచ్చి 15 మందితో తనపై దాడి చేశారని ఆరోపించింది. తనను రాజ్​తరుణ్, అతని తల్లిదండ్రులు రోడ్డుకు ఈడ్చాలని చూస్తున్నారని పేర్కొంది. అతని తల్లిదండ్రులు మాత్రమే వస్తే ఇంట్లోకి రానిచ్చేదానినని, కానీ 15 మంది రౌడీలతో వచ్చి దాడి చేశారని చెప్పింది.

గతంలో రాజ్‌తరుణ్‌పై పెట్టిన కేసులన్నింటిని ఉపసంహరించుకునేలా మాట్లాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ నిప్పు రాజేస్తున్నారని తెలిపింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను వేధించిన మస్తాన్‌ సాయిని ఎలాగైతే జైలుకు పంపించానో రాజ్‌తరుణ్‌ను కూడా అలాగే జైలుకు పంపిస్తానని హెచ్చరించింది.