Sathi Leelavathi: పెళ్లి తర్వాత కొత్త సినిమా మొదలెట్టిన మెగా కోడలు.. డైరెక్టర్ ఎవరంటే?

Sathi Leelavathi: పెళ్లి తర్వాత కొత్త సినిమా మొదలెట్టిన మెగా కోడలు.. డైరెక్టర్ ఎవరంటే?

మెగా హీరో వరుణ్ తేజ్‌‌‌‌‌‌‌‌తో పెళ్లి తర్వాత హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొంత గ్యాప్ ఇచ్చారు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi ). ఇకపై ఆమె సినిమాలు చేస్తుందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 

అయితే లేటెస్ట్గా లావణ్య త్రిపాఠి లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi)పేరుతో ఇది తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌‌‌‌‌‌‌‌.ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై నాగ మోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మిస్తున్నారు.

నేడు సోమవారం (ఫిబ్రవరి 3న) ‘సతీ లీలావతి’ చిత్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పూజా కార్య‌క్ర‌మాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జ‌రిగాయి.

ALSO READ | Pushpa 2 OTT: గ్లోబల్ రేంజ్‍లో పుష్ప 2 ట్రెండింగ్.. కానీ, థియేటర్ వసూళ్లకు బ్రేక్.. 60వ రోజు ఎంతంటే?

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర బృందంతో పాటు హీరో వ‌రుణ్ తేజ్‌ కూడా పాల్గొన్నారు. నిర్మాత హరీష్ పెద్ది ముహూర్తపు క్లాప్ కొట్టగా, వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టి.ఎల్‌.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఎగ్జయిటింగ్ స్టోరీ లైన్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రను లావణ్య పోషించనుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరి ఇపుడు లావణ్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ మూవీకి మిక్కీ జె.మేయ‌‌‌‌‌‌‌‌ర్ సంగీతం అందిస్తున్నారు. బినేంద్ర మీన‌‌‌‌‌‌‌‌న్ సినిమాటోగ్రాఫ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌గా వ‌‌‌‌‌‌‌‌ర్క్ చేస్తున్నారు.