హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత హీరోయిన్‌గా కెరీర్‌కు కొంత గ్యాప్ ఇచ్చారు లావణ్య త్రిపాఠి. ఇకపై ఆమె సినిమాలు చేస్తుందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఆదివారం తను లీడ్ రోల్‌లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సతీ లీలావతి’ పేరుతో ఇది తెరకెక్కబోతోంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగ మోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మిస్తున్నారు.
ఆదివారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎగ్జయిటింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రను లావణ్య పోషించనుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.