మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), అందాల రాక్షసి బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది జూన్ 9న ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. అప్పటి నుండి ఈ జంట వైరల్ అవుతూనే ఉన్నారు. అయితే.. పెళ్లి తరువాత వరుణ్ తేజ్ తన సినిమాల కోసం మీడియా ముందుకు వచ్చినా.. లావణ్య మాత్రం చాలా కాలం కెమెరా ముందుకు రాలేదు. తాజాగా ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఇందులో భాగంగా వరుణ్ తో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు లావణ్య. దీంతో ఆమె వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి తన భర్త వరుణ్ తనకు ప్రపోజ్ చేసిన విషయం గురించి చెప్పుకొచ్చారు లావణ్య. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో మా మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా ముగిసే సమయానికి అది ప్రేమగా మారింది. తొలిప్రేమ సినిమాలో రాశిఖన్నాకి కాలేజ్ లో అందరిముందు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు కదా.. సేమ్ అలాగే నాకు కూడా ప్రపోజ్ చేశాడు వరుణ్. అప్పటికి వరుణ్ పై నాకు కూడా ఇష్టం ఏర్పడడంతో వెంటనే ఒకే చెప్పేశాను. అంటూ సింగ్గుపడుతూ చెప్పుకొచ్చింది లావణ్య. ప్రస్తుతం లావణ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ :- ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే నల్గొండ సభ : కడియం శ్రీహరి
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.