పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కు దగ్గరగా మిస్ పర్ఫెక్ట్‌‌‌‌.. లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కు దగ్గరగా మిస్ పర్ఫెక్ట్‌‌‌‌.. లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్‌‌‌‌(Miss Perfect).  అభిజీత్(Abhijith), అభిజ్ఞ(Abhigna) ముఖ్య పాత్రలు పోషించారు.  విశ్వక్ ఖండేరావ్(Vishwak Khanderao) దర్శకత్వంలో  అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. శుక్రవారం నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్‌‌‌‌ అవుతోంది. ఈ సందర్భంగా లావణ్య చెప్పిన విశేషాలు. ‘‘ఇదొక రొమాంటిక్ కామెడీతో కూడిన మంచి స్ర్కిప్ట్. ఇందు లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చూసే కామెడీ ఉండదు. డిఫరెంట్ క్యారెక్ట ర్స్ ఉంటాయి.  నేను మిస్ లావణ్య, లక్ష్మీ అనే పాత్రలు పోషించాను. లావణ్య ఒక పర్ఫెక్షనిస్ట్.  ప్రతి పనిలో పర్ఫెక్ట్‌‌‌‌గా ఉండాలనుకోవడం కొన్ని ఇబ్బందులు తీసు కొస్తుంది. ఈ క్యారెక్టర్స్‌‌‌‌లో అన్ని ఎమోషన్స్ ఉన్నా యి. ఒక నటిగా నేను భిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటాను.

ఆ క్రమంలో నాకు ‘మిస్ పర్ఫెక్ట్’ లో చేసే చాన్స్ దక్కింది. నేను చేసిన రెండు పాత్రలు నా పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కు దగ్గరగా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మిలా ఉంటాను. సెట్‌‌‌‌లో లావణ్య క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లా పర్ఫెక్షన్ కోరుకుంటాను.  కొత్త డైరెక్టర్స్‌‌‌‌తో వర్క్ చేయడం ఎప్పుడూ రిఫ్రెషింగ్‌‌‌‌గా ఉంటుంది. విశ్వక్ ఖండేరావ్ రైటింగ్ యూనిక్‌‌‌‌గా ఉంటుంది. సెట్‌‌‌‌లో ఎవరి ఒపీనియన్ అయినా తీసుకునేవారు. నేను చెప్పే సజెషన్స్ కూడా వినేవారు. ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. ఇక వరుణ్ తేజ్‌‌‌‌తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది.  వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు.  ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం గుడ్ ఫీలింగ్ ఇచ్చింది.

ఈ సిరీస్‌‌‌‌ను వరుణ్ చూసి మంచి క్వాలిటీతో బాగుందని చెప్పాడు.  తనకు సిరీస్ మొత్తం నచ్చింది. అలాగే  నేను సినిమాల ఎంపికలో ఎప్పుడూ సెలెక్టివ్‌‌‌‌గా ఉంటూ వచ్చా. తక్కువ సినిమాలు చేసినా నటిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. ప్రస్తుతం కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా పూర్తి చేశా. అందులో పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా. అలాగే ఓ తమిళ మూవీ చేస్తున్నా’’.