మెగా కోడలు లావణ్య కొత్త వెబ్ సిరీస్.. టీజర్ ఎలా ఉందో చూశారా?

మెగా కోడలు లావణ్య కొత్త వెబ్ సిరీస్.. టీజర్ ఎలా ఉందో చూశారా?

పెళ్లి తరువాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్(Miss Perfect). బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో అభిజ్ఞ కీ రోల్ చేస్తున్నారు. విశ్వ‌క్ కే ఖండేరావ్ దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ వస్తున్న ఈ సిరీస్ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. టీజర్ కూడా అదే లెవల్లో పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రతీ విషయంలోనూ పెఫెక్ట్ గా ఉండే అమ్మాయిగా లావణ్య కనిపించారు. ఆమె చెప్పిన..  నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విష‌యం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం.. అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలా పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు దర్శకుడు విశ్వ‌క్ కే ఖండేరావ్. 

మరి టీజర్ తో మంచి రెస్పీన్స్ తెచ్చుకున్న ఈ సిరీస్ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు మేకర్స్. మరి పెళ్లి తరువాత లావణ్య చేస్తున్న ఈ మొదటి వెబ్ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.