మెగా ఫ్యామిలీ కొత్త కోడలు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) సతీమణి లావణ్య త్రిపాఠి(Lavanya Thripati) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆమె సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ విషెష్ తెలిపారు. ఇందులో భాగంగా ఆమె రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. మరో గొప్ప సంవత్సరం, సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. అంటూ రాసుకొచ్చారు.
దాంతో లావణ్య చేసిన ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజన్స్ రామ్ చరణ్ ను బావా అని సంబోదించాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ అని పేరుతో కాకుండా బావా అని పిలిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. మరి నెటిజన్స్ కామెంట్స్ కి లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ | Ntr, Ram Charan: రామ్ చరణ్కు బర్త్డే విషెష్ తెలిపిన ఎన్టీఆర్