సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’.  భీమిలీ కబడ్డీ జట్టు ఫేమ్  తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.  దుర్గాదేవి పిక్చర్స్,  ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌‌పై నాగ మోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలవగా గురువారంతో ఫస్ట్ షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. హైదరాబాద్‌‌లో జరిగిన షెడ్యూల్‌‌లో హీరోహీరోయిన్స్‌‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌‌ను కూడా స్టార్ట్ చేయనున్నట్టు తెలియజేశారు. లావణ్య  టైటిల్‌‌ రోల్‌‌లో నటిస్తున్న ఈ చిత్రంలో  ఆమె పాత్ర అందర్నీ ఆకట్టుకునేలా  ఉంటుంద న్నారు. కంప్లీట్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా,  ప్రేక్ష కులంతా హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు  మేకర్స్ తెలియజేశారు. మిక్కీ జె.మేయ‌‌ర్​ ఈ  చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.