
సాయి దుర్గ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ‘హనుమాన్’ ప్రొడ్యూసర్స్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌ని ఓ భారీ సెట్‌లో చిత్రీకరించారు. ప్రేక్షకులకు ఇది గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతోందని మేకర్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఓ లావిష్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. వెట్రివేల్ పళనిసామి డీవోపీ కాగ నవీన్ విజయకృష్ణ ఎడిటర్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది.