బైక్ కిస్తీ కట్టలేదని ఫైనార్సర్ల ఒత్తిడి చేశారు. చేతిలో ఉన్న బైక్ ని బలవంతంగా లాక్కెళ్లారు. తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మోతిరాం తండాకుచెందిన లావూరి మంజా బైక్ ఫైనార్సర్ల ఒత్తిడి భరించలేక బుధవారం (జనవరి 3) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరిలోని వీల్ మార్ట్ సంస్థ ముందుకు ఆందోళనకు దిగారు.
వీల్ మార్ట్ ఫైనార్సర్ల ఒత్తిడి వల్లే మంజా ఆత్మహత్య చేసుకున్నాడని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. భువనగిరిలో వీల్ మార్ట్ కంపెనీ ముందు, జాతీయ రహదారిపై భైఠాయించారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.