
ముంబై: బలవంతపు మతమార్పిడిలు, ‘లవ్ జిహాద్’లను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నది. ఇందుకోసం చట్టంపై అధ్యయనానికి గాను ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేసింది.
మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో మహిళా, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ విభాగాల కార్యదర్శులతోపాటు హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.