రంగారెడ్డి సింబయాసిస్ వర్శిటీలో లా విద్యార్థి మృతి.. అసలేం జరిగింది.?

రంగారెడ్డి సింబయాసిస్ వర్శిటీలో లా విద్యార్థి మృతి.. అసలేం జరిగింది.?

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం  సింబయాసిస్ యూనివర్సిటీలో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందాడు.  లా మూడవ సంవత్సరం చదువుతున్న  ఢిల్లీకి చెందిన విద్యార్థి షేగ్ బిక్ బసూ మార్చి 10న హాస్టల్ వాష్ రూమ్ కి వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు.  తలుపులు విరగొట్టి  విద్యార్థిని బయటకు తీసుకొచ్చారు తోటి విద్యార్థులు . చికిత్స కోసం శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.

ALSO READ | రంగారెడ్డి కలెక్టరేట్ ముందు రైతుల ఆత్మహత్యాయత్నం

విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అయితే విద్యార్థిది ఆత్మహత్య, లేక సాధారణ మరణమా అన్నది తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మర్డర్ చేసినట్లు  ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. బాత్రూంలో పడిపోవడం,డోర్ పెట్టి ఉండటంతో విద్యార్థికి హార్ట్ అటాక్ రావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.