లా స్టూడెంట్​ మృతిపై నిష్పక్షపాత విచారణ జరగాలి

  • సీపీని కలిసి విజ్ఞప్తి చేసిన న్యాయవాదులు

బషీర్ బాగ్, వెలుగు : మలక్​పేటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లా స్టూడెంట్​ఇస్లావత్ శ్రావ్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ లోని ఓల్డ్ సీపీ ఆఫీసులో సిటీ సీపీ సీవీ ఆనంద్ ను న్యాయవాదులు సతీశ్, సంతోష్ , కిరణ్ శుక్రవారం కలిశారు.

శ్రావ్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని, ఎఫ్ఐఆర్ లో అనుమానితులుగా ఎవరి పేరు పెట్టలేదని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రావ్య చనిపోయి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. శ్రావ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.