హైదరాబాద్ లో లా విద్యార్థిని అనుమానస్పద మృతి...

హైదరాబాద్ లో లా విద్యార్థిని  అనుమానస్పద మృతి...

హైదరాబాద్ లోని మలక్ పేటలో లా విద్యార్థిని అనుమాస్పదంగా మృతి చెందింది.   మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని  మూసారం బాగ్ లో ఓ  కన్సల్టెన్సీ ఆఫీస్ లో  పనిచేస్తున్న లా విద్యార్థిని 20ఏళ్ళ ఇస్లావత్ శ్రావ్య అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో  ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావ్య మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు గిరిజన సంఘాలు, యువతి తల్లిదండ్రులు. 

ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తల్ పక్కన ఓ తాండకు చెందిన ఇస్లావత్ శ్రావ్య  ఎల్బీనగర్ లోని  మహాత్మా గాంధీ లా కాలేజీలో లా థర్డ్ ఇయర్  చదువుతూ.. ఓ సీనియర్ అడ్వొకేట్ దగ్గర జూనియర్ గా ఉంటూ  మలక్ పేట  మూసారం బాగ్ లోని ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది.ఆదివారం ( నవంబర్ 24, 2024 ) కన్సల్టెన్సీ  యజమాని నవీన్ కార్యాలయంలో శ్రావ్య  ఫాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే శ్రావ్య ది ఆత్మహత్య కాదని.. లైంగిక వేధింపులు చేసి, హత్య  చేశారని  గిరిజన సంఘాలు మలక్ పేటలో మెట్రో స్టేషన్ వద్ద రాస్తారోకో కు దిగారు. శ్రావ్య మృతి కి కారకులైన నవీన్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి గిరిజన సంఘాలు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే సమాచారం తెలిసిన పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని  ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు యువతి కుటుంబసభ్యులు, గిరిజన సంఘాలు. మలక్ పేట మెట్రో స్టేషన్ దగ్గర గిరిజన సంఘాలు రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది